![]() |
![]() |

స్టార్ మా సీరియల్స్ లో ప్రతీవారం అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్లే సీరియల్ బ్రహ్మముడి. కానీ గత రెండు వారాలుగా దీని టీఅర్పీ ఫుల్ గా పడిపోయింది. ఈవారం రేటింగ్‌లో రాత్రి 7.30 గంటలకు ప్రసారం అయిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 11.20 టీఆర్పీ రేటింగ్ సాధిస్తే.. బ్రహ్మముడి సీరియల్ కేవలం 6.31 శాతం మాత్రమే రేటింగ్ సాధించి.. టాప్ 5లో కూడా లేకుండా పోయింది. అయితే ఎప్పుడైతే బ్రహ్మముడి మధ్యాహ్నానికి మారిందో అప్పుడే కార్తీకదీపం 2 సీరియల్ నెంబర్ 1 ప్లేస్‌లోకి వచ్చేసింది.
కార్తీక దీపం 2 సీరియల్ 11.96 టీఆర్పీ రేటింతో నెంబర్ 1 స్థానంలో ఉంటే.. 11.20 రేటింగ్‌తో ఇల్లు ఇల్లాలు పిల్లలు రెండో స్థానంలో ఉంది. అనూహ్యంగా చిన్ని సీరియల్.. 10.73 రేటింగ్‌తో మూడో స్థానంలోకి వచ్చింది. ఇంటింటి రామాయణం 10.21తో నాలుగో స్థానంలో ఉండగా.. గుండెనిండా గుడిగంటలు 9.88 రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉంది. మగువ ఓ మగువ 9.32 రేటింగ్‌తో ఆరో స్థానంలో ఉంది. చిన్ని, ఇంటింటి రామాయణం సీరియల్స్ గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ని క్రమక్రమంగా వెనక్కి నెట్టుతున్నాయి.
బ్రహ్మముడిని బీట్ చేయడం కష్టమే అనుకున్న తరుణంలో ఆ సీరియల్ టైమింగ్ మార్చి.. అసలు టాప్ 6లో కూడా లేకుండా చేసిన ఘనత స్టార్ మా ఛానల్‌కే దక్కింది. కానీ.. బ్రహ్మముడి సీరియల్ టైమ్‌లో ప్రసారం అవుతున్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ టాప్ 2లోకి వచ్చేసింది. మొత్తానికి బ్రహ్మముడి సీరియల్‌కి పెద్ద బొక్కే పడింది.
![]() |
![]() |